ఉచిత దంత వైద్య శిబిరం

పత్రికా ప్రచురణార్థం

ఉచిత దంత వైద్య శిబిరం

భీమిలి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆధ్వర్యంలో తాటితూరు పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు 30.09 2021 నుండి 06.10. 2021 వరకు ఉచిత దంత వైద్య శిబిరంను నిర్వహించడం జరిగినది.
 ప్రధాన వైద్యులు డాక్టర్ ఆదిత్య తేజ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో పాఠశాల లోని సుమారు 392 మంది విద్యార్థినీ విద్యార్థులకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డొక్కర శ్రీనివాస రావు తెలిపారు , అదేవిధంగా డాక్టర్ ఆదిత్య ప్రసాద్ మరియు ఇతర దంత వైద్యులు ఆరోగ్యము మరియు నోటి సమస్యలపై విద్యార్థులకు తరగతి గదిలో అవగాహన కల్పించడం పట్ల ప్రధానోపాధ్యాయులు సంతృప్తి వ్యక్తపరుస్తూ అభినందనలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో ఇతర వైద్యులు డాక్టర్ సాయి వాసుకి , డాక్టర్ ప్రియాంకా యమున, డాక్టర్ కాజల్ త్రిపాఠి మరియు పాఠశాల ఉపాధ్యాయులు టి. ఎస్ .వి .ప్రసాద్ రావు, సత్యనారాయణ, అప్పలనాయుడు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.