ఆంధ్రులమా అంధులమా

ఆంధ్రులమా, అంధులమా?

రాజధాని పాడుపడింది 
పోలవరం మూలపడింది! 
.
పోర్టులన్నీ పరులపాలు అంధులమా
విశాఖ ఉక్కు విదేశీయులపాలు! 

ఇసుక బంగారమైంది 
మద్యం ఏరై పారింది! 

కరెంటు బిల్లులతో షాకులు 
కరెంటు కోతలతో బ్రేకులు! 

కొత్త పన్నుల రాపిడి 
పథకాల పేరుతో దోపిడి! 

డీజిల్‌ పెట్రోలు కొనలేము 
వంటసరుకులు కొని తినలేము! 

నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు 
ఉద్యోగస్తులకు జీతాలు రావు! 

పరిశ్రమలు పారిపోతున్నాయి 
ప్రజలు వలసపోతున్నారు! 

ఆడపిల్లపై రోజుకో అత్యాచారం 
దళితులపై దాడులు నిత్యకృత్యం! 

మాదకద్రవ్యాలకు మనది చిరునామా 
పరువుతీసిన గంజాయి వనాల హంగామా! 

రహదారులన్నీ గుంతలు గుంతలు 
బూతుపురాణాలు వినిపిస్తున్న మంత్రులు! 

కాంట్రాక్టర్ల కన్నీళ్లు 
పింఛను పోయినోళ్ల వేడుకోళ్లు! 

ప్రభుత్వ భవనాల తనఖాలు 
ప్రభుత్వ భూముల అమ్మకాలు! 

లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం 
ఫ్యాక్షన్‌ పడగలో రగిలే రావణకాష్టం! 

ఇంత విధ్వంసం జరుగుతున్నా .....
ఇసుమంతైనా చలించం 
పెదవి విప్పి ప్రశ్నించం 
ప్రజాస్వామ్యాన్ని రక్షించం 
మన బతుకులు సరేకానీ... 
మన పిల్లల భవిష్యత్తు గురించైనా ఆలోచించమా? 

మూగవాళ్లమా?.. చెవిటివాళ్లమా? 

ఇంతకీ మనం..ఆంధ్రులమా అంధులమా? 

                      - ఒక ఆంధ్రుడి ఆవేదన