జీవో ల పేరుతో ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుంది - టిఎన్ఎస్ఎఫ్

 *అనకాపల్లి* : 

జీవో ల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తూ విద్యార్థులను మోసం చేస్తోందని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు పెదిరెడ్డి నాగ వెంకటరమణ అన్నారు.

 సోమవారం అనకాపల్లి పార్లమెంట్ టిఎన్ఎఫ్ఎస్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ లను పునరుద్ధరించాలని కోరుతూ రెవెన్యూ డివిజనల్ అధికారి సీతారామారావు గారికి కు వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా నాగ వెంకటరమణ మాట్లాడుతూ ఆసెట్ లో పాసైన విద్యార్థులు యూనివర్సిటీలో ఎస్సి బిసి ఎస్టి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లిస్తామని వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 77 విడుదల చేశారని కానీ మొదటి సంవత్సరం విద్యార్థులకు కేవలం 10 వేల రూపాయలు చెల్లించి తగ్గిన అమౌంట్ విద్యార్థులే చెల్లించాలని ఆదేశాలు రావడంతో పేద విద్యార్థులు అయోమయంలో పడ్డారని సుమారు లక్షా 50 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందని విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఏర్పడే పరిస్థితి ఉన్నదని తక్షణమే జీవో నెంబర్ 77 ప్రకారం గా పూర్తి రియంబర్స్మెంట్ చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు, 

అమలు చేయకపోతే దశలవారీగా విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అలాగే క్రిస్టియన్, ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు దశాబ్దాలుగా అమలులో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్రీ వెంకట సందీప్, అనకాపల్లి పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ షావుష, నియోజకవర్గ అధ్యక్షులు గొల్లవిల్లి ప్రవీణ్, అధికార ప్రతినిధి పిట్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Reporter
సురేశ్