బాలికలు, యువతులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను ఓ తండ్రి, అన్న, మేనమామలా ఆలోచించిన సీఎం జగన్ శానిటరీ నేప్ కిన్స్ పంపిణీ చేస్తున్నారని అన్నారు.

వైఎస్సార్‌ ఆసరా పథకం రెండో విడతలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలీ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఆదివారం మధ్యాహ్నం 8వ వార్డు, యండాడలోని రాజీవ్ నగర్ లో.. అనంతరం 7వ వార్డు, స్వతంత్ర నగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 
*ఈకార్యక్రమాల్లో 20వేలకు పైగా మహిళలు పాల్గొన్ని ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో భీమిలీ నియోజకవర్గ పరిధిలోని 1,2,3,4 వార్డులకు చెందిన ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..* 

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలకు చేయూతనిస్తున్నాయని అన్నారు.

 *కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

* గత ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి మరచిందని అన్నారు. హామీలిచ్చి నెరవేర్చని ప్రభుత్వంగా మిగిలిపోతే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే అనేక పథకాలు అమలు చేసిందని అన్నారు. 

గ్రామీణ పేదిరిక నిర్మూలనలో భాగంగా మెప్మా, సెర్ప్ ద్వారా డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల అకౌంట్లలో నేరుగా జమ చేస్తారని అన్నారు. 

*ఈ పథకం ద్వారా ఇచ్చే డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు తమ అభివృద్ధిలో భాగంగా ఉపయోగించుకోవాలని మంత్రి అన్నారు.* 

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. 

కేంద్రం చట్టం చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా.. ఈ చట్టం ద్వారా మిగిలిన రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. 

*బాలికలు, యువతులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను ఓ తండ్రి, అన్న, మేనమామలా ఆలోచించిన సీఎం జగన్ శానిటరీ నేప్ కిన్స్ పంపిణీ చేస్తున్నారని అన్నారు.* 

బెల్ట్ షాపులను అరికట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. 

నియోజకవర్గ పరిధిలో బెల్ట్ షాపులను తొలగించాలని పోలీసులను ఆదేశించారు. స్వచ్ఛమైన పాలన ద్వారా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని సీఎం జగన్ కాంక్షిస్తున్నారని అన్నారు. 

ఈ సందర్భంగా 5,6,7 వార్డులకు సంబంధించి 992 స్వయం సహాయక సంఘాలకు చెందిన 10127 మంది సభ్యులకు రూ.12,05,86,541ల చెక్కును, 8వ వార్డుకు సంబంధించి 259 స్వయం సహాయక సంఘాలకు చెందిన 2605 మంది సభ్యులకు రూ.3,15,86,594 చెక్కును మంత్రి సభ్యులకు అందించారు. 

డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు.


ఈ కార్యక్రమంలో నగర మేయర్ హరి వెంకట కుమారి, జోనల్ కమీషనర్లు రాము, వెంకటరమణ, నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి ముత్తంశెట్టి మహేశ్, 6,7,8 వార్డు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.