మహిళల అభ్యున్నతికి కట్టుబడి డ్వాక్రా మహిళలకు ఆర్ధికసాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపారు. ఈ సంక్షేమ పధకం ద్వారా లబ్ధిదారులైన మహిళలను, వారి అభిరుచికి తగ్గ స్వయం ఉపాధిని ఎంచుకుని ప్రారంభించమని,
ధైర్యంగా మీ కాళ్ళపై మీరు నిలబడాలని, అంతేకాక మీరు మరికొందరికి ప్రేరణ కావాలని, అలాగే మీరు సంపాదించుకోవడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని,
మన రాష్ట్రం మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలన్న జగనన్న కలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.
చక్కటి పధకాలతో అందరి హృదయాలకు చేరువైన జగనన్నకు అందరి తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమములో DMC నాగరాజు (IB&CB) స్పెషలిస్ట్, సిఈఒ లక్ష్మీ, అమ్మాజీ , ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్
జయశ్రీ గాజువాక