93వార్డు వై ఎస్ ర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి రాజు ఆధ్వర్యంలోప్రజలకు వైధ్య సేవలు

ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గం లో కొన్ని చోట్ల మలేరియా, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అనుకోని విధంగా చాలామంది ఈ జ్వరాలతో బాధపడుతున్నారు. 93వ వార్డు పరిధిలోని కొందరు  జ్వరంతో బాధపడుతున్న విషయం  తెలిసిన వెంటనే 93 వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దాసరి రాజు గారు అంజనాద్రి కాలనీ, సింహాద్రి నగర్, భరత్ నగర్ లో మలేరియా, డెంగ్యూ, చికెన్‌ గున్యా వంటి జ్వరాలు రాకుండా ముందస్తుగా అన్ని వీధుల్లో మలాథియాన్‌  మందును చల్లించారు. వార్డు మొత్తం దోమల మందు చల్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో అక్కడ పేరుకున్ప నీటిని తొలగించి పొడిగా ఉంచాలని, ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే స్థానిక ఆరోగ్య కేంద్రాలలో తెలియపరచడం ద్వారా వైద్య పరమైన సలహాలు పొంది తగు జాగ్రత్తలు వహించాలని కోరారు. వార్డులోని ఆరోగ్య సిబ్బంది ద్వారా ముందస్తుగా యాంటీబాడీస్ ని ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం జ్వరంతో బాధపడుతున్న వారికి కావలసిన మందులు ఏర్పాటు వంటి కార్యక్రమాన్ని ప్రహ్లాద పురంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు దాసరి రాజు గారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.