జనసేవ,ఆనందపురం 3:
మండలంలోని చందక గ్రామానికి చెందిన విద్యుత్ ఉద్యోగి లోలుగు రామారావు అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులను వైకాపా మండల అధ్యక్షుడు బంక సత్యం పరామర్శించి ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు.
వైయస్సార్ బీమా కింద 5 లక్షల వరకు మంజూరు అయిందని తక్షణ సహాయం పదివేల రూపాయలు మృతుని భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంక శ్రీను ,మాజీ సర్పంచ్ గుషిడి వెంకట రమణ, కోపరేటివ్ డైరెక్టర్ లోలుగు రాజు, దొంతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.