పద్మనాభం:జనసేవ న్యూస్
పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు పద్మనాభం మండలం బిజెపి కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. పండిట్ జీ సేవలను గుర్తు చేశారు. అందరూ క్రమశిక్షణతో ఉండాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డిపల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మహంతి అప్పల రమణ (శ్రీను ), పాలూరి కృష్ణారావు, సారిక ప్రకాష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )
Ads