కంచరపాలెం:జనసేవ న్యూస్
కంచరపాలెం మెట్టు నుండి ఊర్వశి జంక్షన్ వరకు, వరల్డ్ హార్ట్ దినం సందర్భంగా, సామాజిక గ్రామీణ వైద్యుల (ఆర్ఎంపి) సంఘం గుండె వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీని కంచరపాలెం జీవీఎంసీ వైద్యశాల. వైద్య అధికారిని డాక్టర్ మొత్తం శెట్టి ప్రియాంక.ప్రారంభించి,ఆర్ఎంపీ వైద్యులు, ప్రజా ఆరోగ్య సూత్రాలు ముద్రించిన కరపత్రాలు పురప్రజలకు అందజేశారు. ఆరోగ్యమే, మహాభాగ్యం. గుండె, పదిలం పదిలం. స్లొగన్స్ తో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డాక్టర్. లక్ష్మణ్, డయాబెటాలజిస్ట్. అమృత అవంతి కంప్యూటర్స్ అధినేత.
మాస్టర్. కోన.ప్రకాష్. పాల్గొని ఆరోగ్య అవగాహన సూత్రాలను ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షులు జంగం జోషి ర్యాలీ నడిపించగా విశాఖ సిటీ ఇంచార్జ్, అధ్యక్ష కార్యదర్శులు, ఆకుల శ్రీనివాసరావు.
బాల శంకరం, లోగిశా గణేష్, నరేంద్రకుమార్, మురళి, మదీనా,లింగరాజు, రాము, మహిళా సభ్యులు.
అన్నపూర్ణ, శాంతి, సోషల్ ఆర్గనైజేషన్ లీడర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )