మజ్జి'కి రౌతు శ్రీను అభినందనలు

ఆనందపురం:జనసేవ న్యూస్

మండల ఎంపిపి గా ఎన్నికైన తర్లువాడ గ్రామానికి చెందిన మజ్జి శారద ప్రియాంకకు అందరూ అభినందనలు చెబుతున్నారు. 

ఇందులో భాగంగా శనివారం పాలవలస పంచాయతీ వైకాపా యూత్ అధ్యక్షుడు రౌతు శ్రీనివాసరావు ఎంపీపీ తండ్రి, మాజీ సర్పంచ్, మజ్జి వెంకట్రావుకు పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా రైతు శ్రీను మాట్లాడుతూ మజ్జి వెంకట్రావు సర్పంచ్ గా విశేష సేవలు అందించి మన్ననలు పొందారని కొనియాడారు. 

తండ్రి బాటలో నడిచిన మజ్జి ప్రియాంక క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించి మండల అధ్యక్ష పీఠం దక్కించుకున్నారని ప్రశంసించారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )

Ads