ఆనందపురం :జనసేవ న్యూస్
చాలా నెలల నుండి వేచి చూస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు గుర్రాలు పై పందెం రాయుళ్లు రెడీ అవుతున్నారు.
ఆనందపురం లోని జడ్పీటీసీ ఎన్నికలు రద్దు కావడంతో, 17 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే ఎన్నికలు జరగగా కొన్ని చోట్ల నమమాత్రంగాను జరిగిన, మరి కొన్ని చోట్ల మాత్రం హోరాహోరీగా ఎవరి ధీమాతో వారు ఉన్నారు, ఈ సమయంలో బెట్టింగ్ బంగార్రాజుల ఆగడాలకు అడ్డులేకుండా పోతుంది.
మండలంలోని వేములవలస, ఆనందపురం, వెల్లంకి, తర్లువాడ, గిడిజాల, కణమం వంటి కొన్ని పంచాయతీ లలో గట్టి పోటీ ఉండటం వలన పందెం రాయుళ్లు వీటిని అనువుగా తీసుకొని భారీ బెట్టింగ్ కు పాల్పడుతున్నారు.
ఐ.పి.ఎల్ వంటి అంతర్జాతీయ స్థాయి బెట్టింగులకు దారితీస్తుంది, దీనితో లక్షల రూపాయలు చేతులు మారనున్నాయి.
ఓ వైపు అభ్యర్థులు గెలుపు పై ఉత్కంఠగా ఉంటే మరో వైపు పందే రాయేళ్ళు వారి అభ్యర్థి గుర్రాల గెలుపు కోసం ఈ నెల 19న వచ్చే ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )