జనరంజకపాలన అందిస్తున్న సి.ఎమ్. జగన్

ఆనందపురం:జనసేవ న్యూస్ 

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలుస్తున్నారని రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. 

ఆనందపురం మండలంలోని గిడిజాల గ్రామంలో నిర్మించిన ఆర్బీకే సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. 

గ్రామీణ ప్రజల బాధలు అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి ఏ గ్రామ సమస్యలు ఆ గ్రామంలోనే పరిష్కారం కావాలని నిర్ణయించారని అన్నారు. మండలంలోని మిగిలిన సచివాలయాల నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతాయని మంత్రి అన్నారు.

తుర్లవాడ గ్రామంలో 43 లక్షలతో నిర్మించిన ఆర్బీకే సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. 

ఆర్బీకేల ద్వారా రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. 

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయని అన్నారు. 

సీఎం జగన్ రైతుల పక్షపాతి అని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ ప్రెసిడెంట్ బంక సత్యనారాయణ, నాయకులు కోరాడ వెంకట్రావు, 
మజ్జి వెంకట్రావు, 
బి ఆర్ బి నాయుడు,
గండ్రెడ్డి శ్రీనివాసరావు, 
పాలవలస వైకాపా నాయకుడు రౌతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )