ఆ ఊరి పేరు నేల్తేరు -అందరూ ఉపాధ్యాయులే - వారి ఇంటి పేరు మాస్టారు ...

 
 ఆనందపురం జనసేవ న్యూస్
 మండలంలోని నేల్తేరు గ్రామానికి చెందిన గండ్రేటి నర్సింహ మూర్తి గారు పదవి విరమణ చెంది పరమపదించారు. 

అతనికి నలుగురు కొడుకులు, ఒక కుమార్తె ఉమా మహేశ్వరి కూడా విద్యావంతురాలె. 

ఆమె భర్త కంటిమహంతి సత్యనారాయణమూర్తి దేవరపల్లి లో డిప్యూటీ ఎమ్మార్వో గా పనిచేసి సేవలందించారు. 

 తండ్రిగారి పేరు నిలబెట్టుకుని అతని అడుగుజాడల్లో నడుచుకునే వారు. 

పెద్ద కుమారుడు సుదర్శన్ పట్నాయక్ మండల లిటరసీ ఆర్గనైజర్గా తన వంతు సేవలు అందించారు. 

ప్రస్తుతం ఆయన చీడికాడ మండలం లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 

తరువాత రెండో స్థానంలో గల రమణ రమేష్ ఆనందపురం హై స్కూల్ లో విద్యా వాలంటీర్ గా విశిష్ట సేవలు అందించారు. 

మూడవ కుమారుడు రవి కిషోర్ పలు ప్రైవేటు సంస్థల్లో ఉపాధ్యాయునిగా మరియు ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. 

జర్నలిస్టుగా కూడా సేవలు అందిస్తున్నారు. 

నాల్గవ కుమారుడు రామ్ సురేష్ విశాఖ కే డి పి ఎం హైస్కూల్లో లెక్కల మాస్టర్ గా పని చేస్తున్నారు.

 ఆనందపురం లోకి వచ్చిన ఎవరైనా మాస్టర్ పేరు చెబితే చాలు వారికి బ్రహ్మరథం పట్టి ఇంటికి చేరధేస్తారు.

 విషయం ఏమిటంటే గురుపూజోత్సవం సందర్భంగా మననం చేసుకునేందుకే.........

జి రవి కిషోర్ (బ్యూరో చీఫ్)