ఫాబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

జనసేవ పత్రికా  భీమునిపట్నం:
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమిలిలో ఈనాడు వర్మ గా ప్రసిద్ధి పొందిన పొత్తూరి రాజేంద్రప్రసాద్ వర్మ ను ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి (ఫాబ్) ఆధ్వర్యంలో సన్మానించారు.

 భీమిలిలో సీనియర్ విలేఖరి గానే కాకుండా, ఉపాధ్యాయ వృత్తిని కూడా ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్న రాజేంద్రప్రసాద్ వర్మ మంచి రచయిత కూడా. 

గత 3 దశాబ్దాలుగా ఎన్నో కథలు, కథానికలు, నవలలు రచించిన ఆయన ప్రస్తుతం మన భీమిలి కథలు పేరిట మనకు తెలియని ఎన్నో భీమిలి విశేషాలు తెలియచేస్తున్నారు. 

భీమిలిలో ప్రసిద్ధ గణిత టీచర్ ఎం ఎన్ ఆచారి చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.

ముందుగా ఫాబ్ ప్రతినిధి సూర్య శ్రీనివాస్ ముసునూరి మాట్లాడుతూ తమ కోరికను మన్నించి ఈ సన్మానికి అంగీకరించిన రాజేంద్రప్రసాద్ వర్మకి కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఎం ఎన్ ఆచారి మాట్లాడుతూ తన శిష్యుడైన పొత్తూరి రాజేంద్ర ప్రసాద్ వర్మని తన చేతుల మీదుగా సన్మానించడం చాలా ఆనందకరమైన విషయమని అన్నారు. 

 సన్మాన గ్రహీత పొత్తూరి రాజేంద్రప్రసాద్ వర్మ మాట్లాడుతూ సహజంగా తాను ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటానని అన్నారు. చిన్నప్పటి నుండే రాయడం అలవాటని, తన రచనలు ఎన్నో పత్రికల్లో ముద్రించబడ్డాయని చెప్పారు.

 అయితే మన భీమిలి కదలు రాసిన తరువాతే తన గురించి అందరికీ తెలిసిందని అన్నారు. తనను సన్మానించిన గురువు ఎం ఎన్ ఆచారికి పాదాభివందనం చేశారు. 

ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి కి తన కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఫాబ్ ప్రతినిధులు సన్నీ కాళ్ళ, సూర్యశ్రీనివాస్ ముసునూరి, చుండూరి మూర్తి, దేవానంద్ మరియు భీమిలి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తంబి, కిషోర్ అడిదం, వర్మ, అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్ట్రర్
శ్రీనివాసరావు