ఆనందపురం:జనసేవ న్యూస్
మండలంలోని 18 గ్రామ సచివాలయం లో ఆదివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరిగినట్లు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి శైలజ తెలిపారు.
18 సంవత్సరాలు పైబడిన సుమారు 2500 మందికి తొలివిడత డోస్ వేసినట్లు చెప్పారు కార్యక్రమానికి మరో, వైద్యాధికారి డాక్టర్ సునీల్, హెల్త్ సూపర్వైజర్ గోవింద్రావు సహాయసహకారాలు అందించారు.
అలాగే దొంతలవారికళ్లాలులో జరిగిన కార్యక్రమం లో గ్రామ కార్యదర్శి బాబి, వీఆర్వో అప్పలరెడ్డి, ఏఎన్ఎం పైడిరాజు, ఆశా వర్కర్ దొంతల లక్ష్మి, వాలంటీర్ హైమావతి తదితరులు పాల్గొని సహాయం అందజేశారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )