ఆడబిడ్డ కు న్యాయం చేయమంటే అరెస్ట్ చేస్తారా - టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

 *భీమిలి* : 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు గుంటూరు లో ఇటీవల హత్యకు గురైన రమ్య కు న్యాయం చేయాలని కోరుతూ తగరపువలస లో కొవొత్తులతో నిరసన కు సిద్దమైన తెలుగుదేశం పార్టీ నాయకులను భీమిలి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. 

ఈ సందర్భంగా అరెస్ట్ అయిన గంటా నూకరాజు మాట్లాడుతూ ఆడబిడ్డకు న్యాయం చేయమని నిరసనలు చేస్తే అరెస్ట్ లు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. 

జగన్ ప్రభుత్వం న్యాయం అనే పదాన్నే మరిచిపోయిందని అన్నారు. 

అరెస్ట్ అయిన వారిలో జీవీఎంసీ 1st వార్డ్ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు, జీవిఎంసి 1st వార్డ్ ప్రధాన కార్యదర్శి పిళ్లా రాజేష్, జీవిఎంసి 1st వార్డ్ యువత అధ్యక్షులు గారి సదానందన్ తదితరులు ఉన్నారు.

Reporter
సురేశ్