జోనల్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జోనల్ కమిషనర్ కు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగినది

భీమిలి జోనల్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జోనల్ కమిషనర్ కు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగినది పర్మనెంట్ కార్మికులు రిటైర్మెంట్ అయిన ఆరు నెలలు కావస్తున్నా కార్మికులకు రావలసిన బెనిఫిట్ ఇంతవరకూ అందలేదు. డంపింగ్ యార్డ్ లో చేస్తున్న కార్మికులకు గత ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు కార్మికులకు సబ్బులు నూనెలు చెప్పులు సంవత్సరానికిఒక్కసారి ఇవ్వవలసి ఉండగా రెండు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు కనీస మెటీరియల్ ఇవ్వలేదు కార్మికుల పై విపరీతమైనపని భారం పడుతుంది పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని 

ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనకు దిగడం జరుగుతుందని హెచ్చరించారు 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆర్ ఎస్ ఎన్ మూర్తి సిఐటియు నాయకులు రవ నర్సింగరావు సురేష్ అప్పన్న మొదలగు వారు పాల్గొన్నారు

Reporter
శ్రీను