రాష్ట్ర టి.ఏన్.ఏస్. ఏఫ్ కమిటీ సభ్యులకు ఘన సత్కారం

 * జనసేవ విశాఖపట్నం* :

తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగునాడు విద్యార్థి సమైక్య ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర కమిటీలో విశాఖపట్నం పార్లమెంట్ తరుపున ఎన్నికైన నాయకులను ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. 

ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి కార్తీక్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ లను శాలువా, పూలదండ లతో సత్కరించి, అభినందనలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎస్ రాతన్ కాంత్ ప్రధాన కార్యదర్శి జోషి యాదవ్ , ఉపాధ్యక్షుడు అవినాష్ అధికార ప్రతినిధి ప్రవీణ్, కార్యనిర్వహణ కార్యదర్శి బోని సురేష్, గాజువాక నియోజకవర్గ అధ్యక్షుడు బోండా రవి , దుర్గాప్రసాద్, అస్లాం, రాజిక్ తదితరులు పాల్గొన్నారు

Reporter
సురేశ్