శిథిల భవనాలలో అంగన్ వాడీ చిన్నారులు తల్లిదండ్రుల ఆందోళన

 పద్మనాభం :జనసేవ న్యూస్
 మండలంలోని పాండ్రంగిలో రెండు అంగన్వాడీ కేంద్రాల భవనాలను కొత్తగా నిర్మించి మంత్రి అవంతి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిపారు. 

అయితే ఆ భవనాలలో కాకుండా పక్కనే గల తుఫాన్ సెంటర్ లో అంగన్వాడి నిర్వహణ చేస్తున్నారు.

గులాబ్ తుఫాన్ దాటికి తుఫాన్ షెల్టర్ ఒకపక్క కుప్ప కూల్పోయినప్పటికీ అందులోనే అంగన్వాడీ కేంద్రం నిర్వహించడం పై స్థానిక పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఏ సమయానికి ఎలా ఉంటుందో అని చిన్నారులు బితుకుబి తుకుమని భయపడుతున్నారు. 

ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మహంతి అప్పల రమణ (శ్రీను) మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడి కేంద్రం ఈ నూతన భవనంలోకి తరలించిన విద్యార్థుల రక్షణకు చూడాలని కోరారు.

(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )