టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి గా లెంక సురేష్

 *ఆనందపురం* : 

తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర కమిటీని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ప్రకటించారు. 

ఈ కమిటీలో భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండలం మిందివానిపాలెం గ్రామానికి చెందిన లెంక సురేష్ ను రాష్ట్ర అధికార ప్రతినిధి గా ఎంపిక చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన తన పనితీరును గుర్తించి తనకు ఈ పదవి ఇచ్చిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సమస్యల పై పోరాడి, రాబోయే రోజుల్లో TNSF బలోపేతానికి నా శక్తికి మిచ్చి పనిచేస్తానని విద్యార్థుల సమస్యల పై నిరంతర పోరాటానికి ముందు ఉంటానని విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తానని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. 

నాకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు గారికి , భీమిలి నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజాబాబు గారికి, పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత గారికి , ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, గణబాబు గారికి, మాజీ మంత్రివర్యులు అప్పలనరసింహ రాజు గారికి, 
చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి, 

గంటా శ్రీనివాసరావు గారికి, విశాఖ పార్లమెంట్ అధ్యక్ష, జనరల్ సెక్రటరీ పల్లా శ్రీనివాసరావు గారికి, పాశర్ల ప్రసాద్ గారికి, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు గారికి , విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఐదు నియోజకవర్గ ఇంచార్జ్ నాయకులందరికి మరియు 
ప్రతి యొక్క భీమిలి నియోజకవర్గ నాయకులకు, నా వెనక ఉండి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు.

Reporter 
సురేశ్