సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం లో ని మూగజీవాలను కాపాడండి

 జనసేవ పత్రికా  సింహాచలం..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఇటీవల లేగ దూడల మృత్యువాత పై విశాఖ టిడిపి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ తీవ్రంగా ఖండించారు.

ఆలయ అధికారులు ఆగమశాస్త్రం పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు

దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా చూడొద్దని, భక్తుల మనోభావాలను గుర్తించాలని అన్నారు

లేగదూడల సమర్పించే టప్పుడు భక్తులకు అవగాహన కల్పించాలని కోరారు

మూగజీవాలు మృత్యువాత పడటం ఎంతో ఆందోళనగా ఉందని తెలిపారు

ఆలయ అధికారులు జెర్సీ లేగదూడలు సమర్పణ చేయుము వద్దు అంటూ బోర్డు లు పెడితే అయిపోతుందా...

లేగదూడలు పరిరక్షించే బాధ్యత మీకు లేదా...

తక్షణమే వీటిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు....

భక్తులు సమర్పించే ధనం ,వెండి ,బంగారం, కావాలి గానీ భక్తులు లేగదూడలు సమర్పిస్తే మీకు భారం గా ఉందని ఎద్దేవా చేశారు

ఇటువంటి దానిపై ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు

Editor
S. Bhaskar Rao