పోలీసుల అదుపులో రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత

 *విశాఖపట్నం* : 
 ఇటీవల హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్యకు 21 రోజులు గడుస్తున్నా న్యాయం జరగలేదని, అసలు దిశ చట్టం ఉందా అని రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్ల ఎదుట శాంతియుతంగా నిరసన


 కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళ, టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో హాజరుకానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ను పోలీసులు అదుపులోకి తీసుకుని తన ఇంటి వద్ద హౌస్ అరెస్టు చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలను, విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టు చేయడం అన్యాయం అని ఇలా ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు సరికదా, మరింత బలం చేకూరుతుంది అని అన్నారు. ఇదిలా ఉండగా మరో పక్క మధురవాడ లో గల దిశ పోలీసు స్టేషన్ వద్ద నిరసన తెలపటానికి ప్రయత్నించిన తెలుగునాడు 

విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తో పాటు, 

జిల్లా మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ది అనంతలక్ష్మీ ని,

 టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రతన్ కాంత్ ను మరియు
 ఇతర విద్యార్థి నాయకులను, మహిళలను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

Reporter
సురేశ్