పద్మనాభం :జనసేవ న్యూస్
భారత ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవం సందర్బం గా మోదీ రాజకీయ ప్రస్థానం మొదలై 20 ఏళ్లు గడిచిన సందర్బంగా ఈ నెల 17వ తేది నుండి అక్టోబరు 7వ తేది వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న నేపధ్యంలో రెండవ రోజు బిజేపి పద్మనాభం మండల ప్రధాన కార్యదర్శి మహంతి అప్పలరమణ ( శ్రీనివాస్) ఆధ్వర్యం లో పాండ్రంగి గ్రామ పంచాయతీ కురపల్లి గ్రామములో ఏర్పాటు చేసినటువంటి వాక్సినేషన్ కార్యక్రమానికి బిజెపి నాయుకులు,కార్యకర్తలు హాజరై ప్రజలను ప్రోత్సహించి సుమారు 30 మంది పైగా వాక్సినేషన్ మొదటి ,రెండవ డో సులను వేయంచడం జరిగింది.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరకూ మాస్కులు మరియు ఓ. ఆర్.ఎస్. డ్రింక్ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంనకు మండల ప్రధాన కార్యదర్శి పాలూరి కృష్ణారావు,యువమూర్చ అధ్యక్షులు హంస మహేష్ , ఓబీసీ అధ్యక్షులు రీసు ఎర్రి నాయుడు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )