సచివాలయంలో మన్మధ రాజా.... రెచ్చిపోయిన ఇద్దరు వాలంటీర్లు - వీడియో వైరల్

 * జనసేవ పత్రికా   చిత్తూరు* :  

జిల్లాలోని నగరపాలక సంస్థ పరిధిలో వాలంటీర్లు డ్యాన్సుల వీడియో వైరల్ అయ్యింది. 

కట్టమంచి 4వ వార్డు సచివాలయంలో విధులు నిర్వహించకుండా మన్మధ రాజా.... మన్మధ రాజా అంటూ మౌనిక-జగదీష్ అనే వాలంటీర్లు స్టెప్పులు వేశారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సచివాలయంలో ఇదేం పనులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.

దీంతో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ విచారణకు ఆదేశించారు. సూపర్‌వైజర్ అధికారి శ్రీలత, సీనియర్ అసిస్టెంట్ తనూజలను విచారణ అధికారులుగా నియమించారు.

 అనంతరం విచారణ చేపట్టి నివేదికను కమిషనర్‌కు ఇచ్చారు. దీంతో ఇద్దరు వాలంటీర్లు జగదీష్, మౌనికలను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

Reporter
సురేశ్