*సింహాచలం* :
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) 9001:2015 సర్టిఫికెట్ లభించడం ఎంతో సంతోషించే విషయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
కుటుంబసభ్యులతో కలిసి ఆయన నేడు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగుల సేవలు,
ఆలయ పరిశుభ్రత, పచ్చదనం.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న మీదట HYM international Certifications సంస్థ ఈ గుర్తింపునిచ్చిందని మంత్రి అన్నారు. భక్తులకు అందిస్తున్న విలువైన సేవలు, హిందూ ధర్మాన్ని, సంస్కృతిని సింహాచలం దేవస్థానం ప్రమోట్ చేస్తోందని సర్టిఫికెట్ లో పేర్కొనడం విశేషమని అన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం ద్వారా దేవస్థానానికి 54 కోట్లు మంజూరయ్యాయని.. కరోనా సెకెండ్ వేవ్ వల్ల ఆలస్యమైన పనులు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో భక్తులకు వసతి సౌకర్యం, క్యూలైన్ లో భక్తులకు మంచినీరు అందించడం వంటి సౌకర్యాలపై దృష్టిపెడతామని అన్నారు. భక్తులకు అన్నదానం సౌకర్యాన్ని కూడా కల్పిస్తే బావుంటుందని..
అధికారులు ఈ అంశంపై దృష్టిపెట్టాలని మంత్రి ఈ సందర్భంగా మంత్రి అన్నారు. పంచ గ్రామాల సమస్య కూడా పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు.
ఈఓ సూర్యకళ మాట్లాడుతూ..
‘మంత్రిగారి చేతుల మీదుగా అవార్డును స్వీకరించడం చాలా శుభ పరిమాణమని అన్నారు. ఆరు నెలల నుంచి దేవస్థానంలో ఉద్యోగులు అందిస్తున్న నాణ్యమైన సేవల గురించి ఆడిటర్ ద్వారా అంతర్జాతీయ సంస్థకు సమాచారం అందించామని అన్నారు.
సేవల్లో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకున్నాం కాబట్టే ఈ సర్టిఫికెట్ దక్కందని అన్నారు. ప్రస్తుతం దేవస్థానంలో ఫుడ్ అండ్ సేఫ్టీ ఆడిటింగ్ జరుగుతోందని.. అందులోనూ ఐఎస్ఓ సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఐఎస్ఓ సర్టిఫికెట్ ను మంత్రి, ఈఓ కలిసి అందుకున్నారు.
మరోవైపు సింహాచలం దేవస్థానం గుర్తింపు పట్ల తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, 98 వ వార్డ్ కార్పొరేటర్ పిసిని వరహ నరసింహ హర్షం వ్యక్తం చేశారు.