కోర్కెల పరిష్కారం కోసం సెప్టెంబర్ 24న స్కీమ్ వర్కర్ల అఖిలభారత సమ్మె

యలమంచిలి,(ఆంధ్రపదం న్యూస్):

కోవిడ్ మహమ్మారి విజృంభణ సందర్భంగా స్కీమ్ వర్కర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేశారని, దీనికి ప్రతిగా ప్రభుత్వం వీరికి 50లక్షల రూ||ల బీమా పధకాన్ని అమలు చెయ్యటానికి నిరాకరించింది.

 అంగన్వాడీలను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా కూడా గుర్తించలేదు. తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన ఆషా వర్కర్లకు నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే అదనపు ఇన్సెంటివ్ గా 6 నెలలకు మాత్రమే ఇచ్చారు. స్కీం వర్కర్లను వర్కర్ల కేటగిరిలో చేర్చలేదు. 

ప్రజారోగ్యం,విద్య, పోషకాహార సర్వీసులను సంస్థాగతం చేయలేదు. ఆరోగ్య సర్వీసుల ప్రైవేటీకరణ, నూతన విద్యా విధానం, ఐసిడిఎస్ మరియు మధ్యాహ్న భోజన పథకం కార్పొరేటీకరణ పథకాలను కుప్ప కూలుస్తాయి.

 వర్కర్లు మరియు లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎన్ని వినతులు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు కావున కేంద్ర కార్మిక సంఘాలు అనుబంధమైన స్కీమ్ వర్కర్ల ఫెడరేషన్ నాయకత్వంలో సెప్టెంబర్ 24న సమ్మెకు బలవంతంగా నెట్ట వేయబడ్డారు.

 దేశంలోని పేద ప్రజలకు ముఖ్యమైన సేవలు అందిస్తున్న స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నామని తెలియజేశారు.

 ప్రభుత్వ పధకాలలో పనిచేసే వారందరినీ వర్కర్లుగా గుర్తించి నెలకు 21 వేల రూ. కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ,పెన్షన్
సదుపాయాలు కల్పించాలని, ఆరోగ్య బీమా, రేషన్ కార్డులు,సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.