వేములవలస గ్రామపంచాయతీలో సింగల్ ఫేస్ కరెంటు వలన లోవోల్టేజీ సమస్య ఉన్నందున

వేములవలస గ్రామపంచాయతీలో ఊర్లో నుండి నుండి ఎస్ సి, బి సి కాలనీ వైపు సింగల్ ఫేస్ కరెంటు వలన లోవోల్టేజీ సమస్య ఉన్నందున, ప్రజలు కరెంటు సమస్య వలన ఇబ్బందులు పడుతున్నందున కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి లోవోల్టేజీ సమస్యను పరిష్కరించ

 వలసిందిగా ఈరోజు ఉదయం మండల అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సురేష్ గారికి వైయస్ఆర్సిపి విశాఖ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మాజీ సర్పంచ్ కోరాడ అప్పలస్వామి నాయుడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

వెంటనే ఏయి గారు స్పందించి ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి అభ్యర్థి కోరాడ అచ్యుత రాంబాబు మరియు కోరాడ శ్రీను పాల్గొన్నారు.