విశాఖపట్నం
ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట ఈ ప్రాంత టీడీపీ నేతలు డ్రామాలు ఆడే బదులు.. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు విశాఖే పరిపాలనా రాజధానిగా కావాలని తీర్మానించి, ఆ తీర్మానాన్ని చంద్రబాబుకు పంపాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖ పరిపాలనా రాజధానికి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది ప్రకటించిన తర్వాతే , ఈ ప్రాంత అభివృద్ధిపై చర్చలు జరపాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలకు దమ్మూ, ధైర్యం ఉంటే విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు చంద్రబాబును ఒప్పించాలని మంత్రి అవంతి కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. పరిపాలనా రాజధానిగా విశాఖను అడ్డుకోవద్దని మంత్రి అవంతి హితవు పలికారు. విశాఖలో టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక పేరిట టీడీపీ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు హాజరైన టీడీపీ మాజీ మంత్రులపై సర్క్యూట్ హౌస్ ల మంత్రి మీడియా సమావేశం నిర్వహించి విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ విధానం మూడు ప్రాంతాల అభివృద్దే లక్ష్యం. అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండాలిని, పరిపాలనా రాజధానిని విశాఖలో పెడితే అమరావతిని నిర్లక్ష్యం చేస్తామని కాదనిీ వివరించారు. అమరావతి ప్రాంత రైతులను కానీ, మరెవర్నీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదని అవంతి శ్రీనివాస్ తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి జగన్ మూడు ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేయాలని మూడు రాజధానులపై అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేసారు. అయితే ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు అంత సానుకూలంగా స్పందించలేదని ఆయన ఆక్షేపించారు.. కనీసం ఇవాళ అయినా ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరుతో చంద్రబాబు, లోకేష్ లేకుండా సమావేశం పెట్టుకోగలిగారని అవంతి విమర్శించారు.
అచ్చెన్నాయుడు ఛాలెంజ్ లు విసిరేముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలని మంత్రి అవంతి కోరారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానికి మీరు అనుకూలమా? వ్యతిరేకమా? ఈ విషయంలో మీకు చంద్రబాబునాయుడును ఎదిరించే దమ్ము,ధైర్యం ఉందా? సూటిగా మీ అభిప్రాయం వెల్లడించాలన్నారు.. రాష్ట్ర చరిత్ర చూస్తే గతంలో మద్రాస్, కర్నూలు, హైదరాబాద్ లు రాజధానులుగా ఉన్నాయని, విభజన తర్వాత 13 జిల్లాలతో కొత్త రాజధాని ఏర్పడిందని అవంతి తెలిపారు. సంపద అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లే మిగత ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆయన తెలిపారు.. అదే రిపీట్ అయితే 25, 30 ఏళ్ల తర్వాత అయినా, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావలంటూ ఉద్యమం మొదలవుతుందన్నారు. మన సంపద అంతా ఒకేచోట కేంద్రకృతం చేయడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని,. అలాంటిది మరోసారి ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే మూడు రాజధానుల అంశాన్ని తీసుకువచ్చామన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతం తమకు ఎన్నో ఇచ్చిందని, రాజకీయ పదవులు, హోదాలు ఇచ్చిందని అవంతి తెలిపారు. రాజధానిని కోరుకోవడం అత్యాశేమీ కాదన్నారు. రాజధాని కావడానికి విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంతాలకు దూరం అని మాట్లాడుతున్నారని అవంతి విమర్శించారు. .వాస్తవాలు ఆలోచించాలని. భ్రమల్లో ఉంటామంటే చేసేదేమీ లేదన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా ఏర్పడితే ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంతో అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలతో పాటు, స్థానికులకు 75శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి చట్టం తెచ్చారని అవంతి గుర్తు చేశారు. ఇటువంటి చట్టం తేవడానికి కూడా గట్స్ ఉండాలన్నారు.
ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పష్టమైన వైఖరితో ఉండాలని మంత్రి అవంతి కోరారు.. ముఖ్యమంత్రి జగన్, తమ పార్టీ ఎమ్మెల్యులు, ఎంపీలు, మంత్రులు... మూడు రాజధానుల విషయంలో అందరమూ ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నామని, గతంలో కర్నూలులో హైకోర్టు కావాలన్న వారే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని అవంతి ఆక్షేపించారు.. హైకోర్టు పెట్టడానికి కర్నూలుకు అర్హత లేదా? టీడీపీలో ముందు క్లారిటీ లేదు. పార్టీలుగా ఎవరికి వారికి భేదాభిప్రాయాలు ఉన్నా... రాష్ట్ర ప్రజలంతా ఒకమాట మీద ఉండాలని, దీనిపై ఒక స్పష్టమైన అభిప్రాయం వెల్లడిస్తే, తర్వాత రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకుందామన్నారు. .