వేములవలస లో గ్రామసభ

వేములవలస లో గ్రామసభ
ఆనందపురం:జనసేవ న్యూస్ 
 మండలంలోని వేములవలస పంచాయతీ సచివాలయ కార్యాలయంలో బుధవారం గ్రామ సభ జరిగింది. ఈ సభలో ఇంచార్జ్ గ్రామ కార్యదర్శి శ్రీరామమూర్తి మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన విషయాలను తెలియజేశారు. అలాగే ధ్రువీకరణ పత్రాలు ఎలా పొందాలి అనే అంశంపై కూడా విశదీకరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లంక కొండమ్మ, ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తో పాటు పాలకవర్గ సభ్యులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్)