ఉచితవైద్య శిబిరానికి అనూహ్య స్పందన

ఉచితవైద్య శిబిరానికి అనూహ్య స్పందన
ఆనందపురం:జనసేవ న్యూస్


 వినియోగదారుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. సింహాచలంలోని పుష్కరిణీ చౌల్ట్రీ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు వికాస్ పాండే, గొర్లె శ్రీనివాస్ నాయుడు శిబిరాన్ని ప్రారంభించారు. వృందా ఆసుపత్రి ఎమ్. డి డాక్టర్ పుట్రేవు వంశీధర్ వారి సహకారంతో బిపి చక్కెర వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు జరిపి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహా నాయకుడు లోగిశ గణేష్, ఎర్నగుల దుర్గాప్రసాద్,  స్థానిక కార్పొరేటర్ పీవీ నరసింహం,మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్, సతివాడ శంకర్ రావ్, రాజా,ఇక్బల్, రామకృష్ణ, నాగేశ్వర్రావు, సందీప్, మదన్ తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో విశిష్ట సేవలందించిన లోగిశ గణేష్ కు అందరూ ప్రశంసలు అందజేశారు.

-జి. రవి కిషోర్(బ్యూరో చీఫ్)




జనసేవ న్యూస్: ఈ పోస్ట్ ని మే ప్రియమైన వారి అందరికీ పాంపించండి.