ఆనందపురం :జనసేవ న్యూస్
వృందా హాస్పిటల్ మరియు సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో.
అవార్డు గ్రహీత కు సన్మాన సభ నిర్వహించారు. సభకు అతిథులుగా ప్రముఖ సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వంశీధర్ పుట్రేవ్, ఇంటర్నేషనల్ అబ్దుల్ కలాం ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్ మమ్ముల తిరుపతిరావు విచ్చేశారు. ఇటీవల మధురైలో అబ్దుల్ కలాం పురస్కారం అందుకున్న ఇప్పలవలస గోపాలరావు కు ప్రత్యేకించి ఈ సభలో శాలువాలతో సత్కరించారు.
సభాధ్యక్షులు తిరుపతి రావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో, కరోన మహమ్మారి తాండవిస్తున్న సమయంలో రక్తం లేనివారికి అత్యధికంగా సుమారు వెయ్యికి పైగా రక్తం అందించడం జరిగిందని, పర్యావరణం పరిరక్షణ కార్యక్రమాలలో అత్యధికంగా మొక్కలు నాటడంలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్న గోపాలరావు కి 2021 అబ్దుల్ కలాం అవార్డు స్థానంలో ఈ అవకాశం కల్పించినట్లు ఈ సందర్భంగా సభలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి మూడు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు,
ఈ కార్యక్రమంలో సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షులు జంగం జోషి, విజయనగరం జిల్లా అధ్యక్షులు గెద్ద చిరంజీవి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు చౌదరి శ్రీనివాసరావు, స్థానిక వైద్యుల సంఘం సిటీ నాయకులు ఇంచార్జ్ ఆకుల శ్రీనివాసరావు, బాల శంకరo, లోగిశ గణేష్, సంఘం ఉపాధ్యక్షురాలు వై రోజా, కల, నరేంద్ర కుమార్, పచ్చిపులుసు కనకారావు, పడాల కోటేశ్వరరావు, మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )