కరోనా నివారణకు పటిష్ట చర్యలు ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

కరోనా నివారణకు పటిష్ట చర్యలు ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం:జనసేవ న్యూస్
మండలంలోని వేములవలస పంచాయతీలో కరోనా నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. తాజాగా మూడవవేవ్ ప్రారంభం కావడంతో పాలకవర్గం అప్రమత్తమైంది. 
స్థానిక ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పాలకవర్గం తో అత్యవసరంగా సమావేశమయ్యారు. నివారణ చర్యలు ఎలా చేపట్టాలనే అంశంపై చర్చించారు. పంచాయతీ పరిధిలో గల కాలనీలు, వేములవలస గ్రామంలో గల తాజా పరిస్థితులపై అంచనా వేశారు. ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. ఇందులో భాగంగా వివాహ వేడుకలకు, ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లో ఎక్కువమంది గుమికూడకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అందరికీ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేయాలన్నారు. పంచాయతీ పరంగా శానిటేషన్, బ్లీచింగ్ వంటి వాటిని ఉపయోగించి అన్ని వీధులను శుభ్రపరచాలని సచివాలయ సిబ్బందికి సూచన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లంక కొండమ్మతో పాటు పాలకవర్గ సభ్యులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )