ఆర్ఎంపి ఉత్తరాంధ్ర జోనల్ కార్యాలయం లో జండా ఆవిష్కరణ

ఆర్ఎంపి ఉత్తరాంధ్ర జోనల్ కార్యాలయం లో జండా ఆవిష్కరణ
ఆనందపురం :జనసేవ న్యూస్ 
ఉత్తరాంధ్ర జోనల్ కార్యాలయంలో ప్రముఖ న్యాయవాది, సంఘం లీగల్ అడ్వైజర్ కె.పి. దేశాయ్, 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు.
ఎందరో త్యాగాల ఫలితం మన భారత స్వాతంత్ర్యం అని దేశాయ్ అన్నారు. వైద్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జంగం జోషి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామీణ వైద్యుల కార్యదర్శి పచ్చిపులుసు కనకారావు, పోతి రెడ్డి సుధాకర్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు ఎన్ .సుగునేశ్వరి, కోరాడ వరలక్ష్మి, స్థానిక సభ్యులు పల్లి వెంకటరమణ, రఘు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )