ఆనందపురం:జనసేవ న్యూస్
వృందా ఆస్పత్రి సౌజన్యంతో ఆర్ఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కంఫర్ట్ హోమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణరాయపురం లో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.
గ్రామీణ వైద్యుల సంఘం సిటీ ఇంచార్జ్ ఆకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల మందికి పైగా రోగులకు ఉచితంగా పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.బి.అశోక్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజలకు సేవలు అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసి ఆకుల శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వంశీధర్ పుట్రేవ్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి పి.హెచ్.సి.వైద్యాధికారిణి యాక్టర్ రోజా రాణి బలగ, ఫేస్కల్ సర్జన్ భ్రమర కుమారి లతో పాటు గ్రామీణ వైద్యుల సంఘం జోనల్ అధ్యక్షుడు జంగం జోషి, కార్యదర్శి గోపి, గౌరవ సలహాదారుడు ముమ్మన తిరుపతిరావు, సిటీ ఇంచార్జ్ ఆకుల శ్రీనివాసరావు,ఆకుల పద్మావతి, నరేంద్రకుమార్, బాల శంకర్రావు, లోగిశ గణేష్,కె.వెంకట్ రావు, ఆనంద్రావు,సూర్యకళ, వాసుదేవరావు,రామ కృష్ణ, మురళి, అన్నపూర్ణ, కుమారిలు పాల్గొని సహాయ సహకారాలు అందించారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )