ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి : డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి : డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ 
ఆనందపురం:జనసేవ న్యూస్ 
మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుందని గ్రేటర్
డిప్యూటీ మేయర్ జియ్యాన  శ్రీధర్ అన్నారు.. మండలములోనీ రామవరం గ్రామంలో ఉన్న 
రాయల్ వైజాగ్ కల్చరల్ సొసైటీ వార్షిక  సర్వసభ్య సమావేశం ఆదివారము నిర్వహించారు,, ఈ సమావేశానికి అధ్యక్షుడు ఆకుల చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, కార్యదర్శి మడుగుల త్రినాధరావు

వార్షిక నివేదికను చదివి వినిపించారు..గత ఏడాది కాలంలో సొసైటీ ద్వార చేపట్టిన పురోగతి అభివృద్ధి పనులను సభ్యులకు ఆయన  తెలియజేశారు,, ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్  శ్రీధర్ , కార్పొరేటర్లు పి ఉషశ్రీ  , 
పీవీసురేష్ ను ఘనంగా సత్కరించారు.. వీరితో పాటు కరోనా సమయములో వైద్య సేవలు అందించిన డాక్టర్ జీవి సూర్య రాము , డాక్టర్ ఆకుల నరేష్,, సర్పంచ్ గండ్రెడ్డి శ్రీనివాసరావు. ఏ ఏం సి ఛైర్మన్ కోడి గుడ్ల సాంబ తదితరులును  కూడా ఘనముగా సత్కరించడం జరిగింది  ., ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ రాయల్ వైజాగ్ కల్చరల్ సొసైటీ కి అవసరమైన చేయూతను అందిస్తామన్నారు,, మిగిలిన కార్పొరేటర్లుతో కలుపుకొని  ఈ సొసైటీ పురోభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు,, ఈ సందర్భంగా నూతన కార్యవర్గంను సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ప్రకటించారు,, అప్పన్న ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి
గంట్ల శ్రీనుబాబు.. ప్రభు ,తదితరులు పాల్గొన్నారు.
రాయల్ వైజాగ్ సొసైటీ నూతన కార్యవర్గం
 నూతన అధ్యక్షులుగా గోకర కొండ శ్రీకాంత్.. ఉపాధ్యక్షులుగా పల్లా ఆనంద్ , సెక్రటరీ గా పెద్దిశెట్టి ఉషశ్రీ,జాయింట్ సెక్రటరీ పసుపులేటి మధుసూదన్ రావు,
కోశాధికారి ఇ.అశోక్ కుమార్ తో పాటు పలువురు కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.
-జి.రవి కిషోర్(బ్యూరో చీఫ్)

జనసేవ న్యూస్: ఈ పోస్ట్ ని మే ప్రియమైన వారి అందరికీ పాంపించండి.