ఎమ్మెల్సీ మాధవ్ కు అభినందనలు

 ఆనందపురం జనసేవ న్యూస్  
 బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ కు ఆనందపురం మండలానికి చెందిన కిసాన్ మోర్చా నాయకుడు ప్రసాద్ రావు పట్నాయక్ మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

విశాఖ లో గల అతని ఇంటి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు. 

అనంతరం ప్రసాద్ రావు పట్నాయక్ భీమిలి మండలం గొల్లపాలెం తాళ్లవలస లో గల మన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ లో గల పిల్లలకు స్నాక్స్ ఏర్పాటు చేశారు.

జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )