లోగిశ గణేష్ కు సేవా రత్న రాష్ట్ర స్థాయి అవార్డు

*లోగిశ గణేష్ కు సేవా రత్న రాష్ట్ర స్థాయి అవార్డు* 
ఆనందపురం:జనసేవ న్యూస్
 సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం విశాఖపట్నం జిల్లా ( సిటీ) కార్యదర్శి లోగిశ గణేష్ కు మదర్ థెరీసా సేవా సంస్థ నుండి అరుదైన రాష్ట్ర స్టాయీ సేవ రత్న అవార్డు ను ఆ సంస్థ వ్యవస్థాపకులు కే. కృష్ణమూర్తి,కొంతమంది ప్రముఖులు చేతులు మీదుగా లోగిశ గణేష్ కు విశాఖ పట్నం జిల్లా పౌరు గ్రంధాలయం లో అందుకోవడం జరిగింది.

ఈ అవార్డ్ ను అందుకున్న నుంచి మరింత బాద్యత పెరిగింది అని గణేష్ అన్నారు . గ్రామీణ వైద్యుడిగా గణేష్ గ్రామాల్లో తరచూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందడం గమనార్హం. వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్నoదుకుగాను సేవా రత్న అవార్డు గణేష్ కు రావడం వలన కొంతమంది హర్షనియం వ్యక్తతం చేసారు. ఈ అవార్డు రావడం పట్ల ఆర్ఎంపి వైద్యుల సంఘం జోనల్ అధ్యక్షుడు జంగంజోషి, గోపి, సహచర వైద్యులు అభినందనలు తెలిపారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )