వాలంటీర్ సూసైడ్.. జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కారణం అంటూ లేఖ

*వాలంటీర్ సూసైడ్.. జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కారణం అంటూ లేఖ* : 
 *అనంతపురం* : తన చావుకు జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కారణం అంటూ లేఖ రాసి సూసైడ్ చేసుకున్న వాలంటీర్. జిల్లాలోని రాయదుర్గంలో వార్డు వాలంటీర్ మహేష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. 
తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న మహేష్, వాలంటీర్ లతో గొడ్డు చాకిరి చేయిస్తున్నారు అని, డిగ్రీ లు చదివి ఏ ఉద్యగాలు లేక వాలంటీర్ ఉద్యోగం లో చేరితే కనీసం చదువుకున్నాం అని కనికారం కూడా లేకుండా అడ్డమైన పనులు చేయిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసినట్లు, ఈ పరిస్థితి వేరే వాలంటీర్ లకు రాకుండా సీఎం చూడాలంటూ బాధితుడు మహేష్ రాసినట్లు ఓ లేఖ వైరల్ అవుతుంది.


సురేశ్