*పల్లెకు ‘ఆరోగ్యం’*
గ్రామాల్లో ప్రజారోగ్యం వివరాల మ్యాపింగ్
ఆరోగ్యశ్రీ కార్డుదారుల సమాచారం విలేజ్ క్లినిక్‌లో అందుబాటులో..
క్యూ ఆర్ కోడ్ స్కానింగ్‌తో వేగంగా వ్యాధి నిర్ధారణ, మెరుగైన చికిత్స
పీహెచ్‌సీలతో కూడా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ అనుసంధానం
కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో 16 మెడికల్ కాలేజీల నిర్మాణం
11 బోధనాస్పత్రుల అప్‌గ్రెడేషన్, మౌలిక వసతుల పెంపు
ఈ తరాలకే కాదు.. భవిష్యత్తు తరాలకూ అత్యుత్తమ వైద్యమే లక్ష్యం
వైద్య రంగంలో ‘నాడు–నేడు’పై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
అమరావతి: ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలని, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీహెచ్‌సీలతో కూడా అనుసంధానం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒక మంచి ఉద్దేశంతో కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని, కార్పొరేట్ తరహా వాతావరణం అక్కడ కనిపించాలని సూచించారు. బెడ్ షీట్స్ దగ్గర నుంచి సేవల వరకు అన్ని విషయాల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా నిర్వహణ ఉండాలన్నారు. ఈ తరాలకే కాదు.. భవిష్యత్తు తరాలవారికి కూడా అత్యుత్తమ వైద్యం అందాలన్నదే తన కల అని సీఎం పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’ కార్యక్రమాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు
డిసెంబర్‌కి అన్నీ పూర్తి..
వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించాలి. ల్యాబ్స్‌తోనూ అనుసంధానం చేయడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది. గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలి. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ విలేజ్ క్లినిక్స్‌కు అందుబాటులో ఉండాలి. ఇదివరకే సేకరించిన డేటా వివరాలను ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానించాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా వైద్యుడు ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు చికిత్సకు ఈ వివరాలెంతో సహాయపడతాయి. సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యమందించేందుకు దోహదపడుతుంది. డిసెంబర్ నాటికి విలేజ్ క్లినిక్స్ అన్నింటినీ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ ఆస్పత్రులే మదిలో మెదలాలి..
ఒక మంచి ఉద్దేశంతో 16 కొత్త మెడికల్