వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆనందపురం:జనసేవ న్యూస్
 మండలంలోని వేములవలస పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
 జాతీయ జెండాను స్థానిక సర్పంచ్ లంక కొండమ్మ , ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం గల మన భారత దేశంలో అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. స్వాతంత్ర్య ఫలాలను పరిరక్షించుకుని ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రికార్డ్ అసిస్టెంట్ దేముడు బాబు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )