ఆనందపురం:జనసేవ న్యూస్
ఆనందపురం మండలం వెల్లంకి గ్రామం లో గల శ్రీ సుబ్బ రామి రెడ్డి కళ్యాణ్ మండపం, దగ్గర బిజేపి పార్టీ కార్యాలయంలో, గాంధీ విగ్రానికి బిజెపి మండల ఉపాధ్యక్షుడు పి. సాయి రమేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు, జరిగాయి,
ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్,ప్రధాన కార్యదర్శి కిసాన్ మోర్చా, విశాఖ పార్లమెంటు జిల్లా, మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమాలు, ఎందరో మహానుభావులు త్యాగం చేస్తే, మనకు స్వాతంత్రం వచ్చింది అని, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్టికల్ 370 రద్దు చేయించి, భారతదేశానికి, నిజమైన స్వతంత్రం తీసుకొచ్చారని మాట్లాడారు, ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, బిజేపి సీనియర్ నాయకులు బోర శ్రీను, పి. సాయి కిషోర్, బిజేపి కిసాన్ మోర్చా కార్యదర్శి గండి లక్ష్మీ రావు,పి. క్రాంతి,పి. కనకరావు,పి. బాపూజీ రావు, తదితరులు పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )