గాజువాక:జనసేవ న్యూస్
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లేటు సనపల.పాండురంగారావు కుమార్తె వివాహానికి జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్బంగా నగరంలో గాజువాక ప్రాంతంలో సోమవారం నాడు జరిగిన వివాహానికి ఎమ్.ఎల్.సి దువ్వారపు.రామరావు,మాజీ శాసనసభ్యులు,విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా.శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్,టీడీపీ అర్బన్ తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ సనపల.
వరప్రసాద్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ సనపల.పాండురంగారావు పార్టీ కి చేసిన సేవలు మరువలేనివని అన్నారు.ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వారి కుమార్తె వివాహానికి ఆర్థికంగా సహాయం అందించిన ముఖ్య నాయకులుకు ఋణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )