ప్యాకెట్ పాలు వద్దు - తల్లి పాలు ముద్దు

*ప్యాకెట్ పాలు వద్దు - తల్లి పాలు ముద్దు* 
ఆనందపురం:జనసేవ న్యూస్ 
మండలంలోని వేములవలస ఊరు లో ఉన్న ప్రాథమిక పాఠశాల లో అంగన్వాడీ కేంద్రo ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా చంటి పిల్లతల్లులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
 ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సర్పంచ్ శ్రీమతి లంక కొండమ్మ , ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తల్లిపాలు శిశువులలో ఆరోగ్యం మరియు మానసికంగా, శారీరికంగా పెరుగుదలకు అవసరమయ్యే సహజ సిద్ధమైన ఆహారం అని అన్నారు. తల్లి నుంచి బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలను అందించడానికి సహాయ పడతాయని అన్నారు. తల్లులు పిల్లలకు తల్లి పాలు ఇవ్వడంతో పాటు పరిశుభ్రమైన పరిసరాలను ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే పిల్లలకు మంచి ఎదుగుదల ఉంటుందని అన్నారు. 
ప్రతీ తల్లి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక విలువలు కలిగిన పదార్దాలు తీసుకోవడమే కాకుండా వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల సలహాలు సూచనలు పాటిస్తూ ఆకుకూరలు, బలమైన పదార్థాలను తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. అలాగే అంగన్వాడీ సూపర్ వైజర్ పి. వేణు వెంకట రత్నం , ఏఎన్ఎం ఉమ మాట్లాడుతూ తల్లులకు ఆరోగ్యం, ఆహారం గురించి, మహమ్మారి కరోనా గురించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరాడ అప్పలస్వామి నాయుడు, హెచ్ ఎం శ్రీలత, అంగన్వాడీ టీచర్లు నాగమణి, కామాక్షి పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )