పాలవలస లో తల్లిపాల వారోత్సవాలు

పాలవలస లో తల్లిపాల వారోత్సవాలు
ఆనందపురం:జనసేవ న్యూస్ 
మండలంలోని పాలవలస గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 
స్థానిక సర్పంచ్ నాగోతి అచియ్యమ్మ ప్రారంభించారు. తల్లి పాల విశిష్టత ను తెలిపారు. ఈ సందర్భంగా వైకాపా మండల యూత్ ప్రెసిడెంట్ రౌతు శ్రీను తన ఆర్థిక సాయం తో 100 మందికి పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చందక ఎల్లారావు, పద్మావతి, కె. ఉమా ప్రతాప్, ఎమ్. సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్)