గృహనిర్మాణంలో భీమిలి భేష్

గృహనిర్మాణంలో భీమిలి భేష్...!
ఆనందపురం :జనసేవ న్యూస్ 
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికి ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలను కూడా పూర్తి చేసి అందిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మాత్యులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు స్పష్టం చేసారు. బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తో కలిసి ఆనందపురం మండలం గండిగుండం లోని వై ఎస్ ఆర్ జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలను పరిశీలించారు. 
 ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా భీమిలి నియోజక వర్గంలో ఇళ్ల నిర్మాణాలు 95 శాతం పూర్తి కానున్నాయని తెలిపారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అవసరమైన సిమెంటు, ఐరన్, ఇసుక మొదలైన వాటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఎటువంటి సమస్యలున్న పరిష్కరించి గృహ నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఫేజ్-I, ఫేజ్ – II లలో మొత్తం 30 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి గృహాలను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 
    పర్యాటకశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గండిగుండం లో జగనన్నకాలనీ హెవే కు దగ్గరగా ఉందని, కుటుంబానికి 70 గజాల స్థలాన్ని ఇస్తూ, ఇళ్లు కట్టి ఇవ్వడం జరుగుతుందన్నారు. మావుళ్లమ్మ అనే మహిళకు రెండవ ఫేజ్ లో మంజూరు అయినప్పటికి ఆమె కట్టుకుంటానని ముందుకు రావడంతో అనుమతి ఇచ్చి కట్టిస్తున్నామని తెలిపారు. ఇది ప్రభుత్వ చిత్త శుద్దికి నిదర్శనమన్నారు. 
    అంతకు ముందు మంత్రులు గండిగుండంలో వై ఎస్ ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. 
 అదే విధంగా గండిగుండం(194గృహాలు), శొంఠ్యాం(364గృహలు), గ్రామాలలో వై ఎస్ ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు. ఆర్ డి ఓ పెంచల కిశోర్, హౌసింగ్ పిడి ఎం .శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )