క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరం

క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరం
ఆనందపురం:జనసేవ న్యూస్ 
క్యాన్సర్ క్యూరీ హాస్పిటల్ మరియు గ్రామీణ సామాజిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ క్యాంప్ పెదగంట్యాడ జంక్షన్లో ఏలేటి రోజా మహిళా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు. క్యాన్సర్ క్యాంపు ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం లో క్యాన్సర్ క్యాంప్ ఎక్కడ గాజువాక ప్రజలకు ఒక శుభవార్త అని కొనియాడారు క్యాన్సర్ వ్యాధి చాలా ప్రాణాంతకమని అది మొదటి దశలోనే గుర్తించి చికిత్స చేసుకోవాలని ప్రజలను కోరారు ఈ క్యాంపు లో క్యాన్సర్ క్యూరీ డాక్టర్లు డాక్టర్ శ్రీ హర్ష , డాక్టర్ చిన్న బాబు పాల్గొని రోగులకు చికిత్స అందించారు. అవసరం అయితే క్యాన్సర్ ఆపరేషన్ లో కూడా ఫ్రీగా చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో 75 వ వార్డు కార్పొరేటర్ ఝాన్సీ లక్ష్మీబాయి, పులి రమణారెడ్డి, 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి.గోవిందరెడ్డి, జిఎంసి మాజీ వైస్ చైర్మన్ కోన చిన్న అప్పారావు,75వ బిజెపి కె.ముసలయ్య, ఆర్ఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షుడు. జంగం జోషి , శిబిరంలో పాల్గొన్నారు. అంజూరి దీపక్. స్థానిక వైద్య సిబ్బంది పతి, గంగ భాయి, సుబ్రహ్మణ్యం, మూర్తి. తదితరులు వచ్చిన రోగులకు సేవలు అందించారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )