దివ్యాంగులకు నిత్యవసర వస్తువులు పంపిణీ

*దివ్యాంగులకు నిత్యవసర వస్తువులు పంపిణీ*
 ఆనందపురం : జనసేవ న్యూస్ 
స్థానిక అంబేద్కర్ భవన్లో
లీడర్ ఎన్జీవో, కారుణ్య క్యాన్సర్ పౌండేషన్ ఆధ్వర్యంలో,
దివ్యాంగులకు నిత్యవసర వస్తువులు, బియ్యం, పప్పు, పంచదార, నూనె, మొ: పంపిణీ చేశారు. 
శ్రీదేవి విజ్ఞాన జ్యోతి అధినేత్రి కీర్తి పట్నాయక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించగా, కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జంగం జోషి, ఏపీజే అబ్దుల్ కలాం సేవ ట్రస్ట్ రాష్ట్ర సమన్వయ కర్త మమ్ముల తిరుపతిరావు, గ్రామీణ వైద్యుల సంఘం ఉత్తరాంధ్ర జోనల్ కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు అతిథులుగా విచ్చేశారు. గత సంవత్సర కాలం నుండి సరైన ఉపాధి లేక, ఇబ్బంది పడుతున్న వారిలో దివ్యాంగుల కష్టాలు వర్ణింప శక్యము కానివని తెలుపుతూ.. 75వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జంగం జోషి తెలిపారు. ఈ కార్యక్రమానికి సహృదయంతో సహాయ పడిన దాతలు, క్రిస్టియన్ మైనారిటీ. భీమిలి నాయకులు ఎస్ వి పి డి ప్రభాకర్, మెడికల్ మేనేజర్ శ్రీనివాస్ లకు ధన్యవాదములు తెలుపుతూ,, కీర్తిశేషులైన రెడ్డి. వారం, జంగం జీవమని. వారి పేరు మీద దాతలుగా నిర్వహించినందుకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు అతిథులు మమ్ముల తిరుపతిరావు, గోపాలరావులు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ నాయకులు గొడుగురాజు, మహిళా ప్రెసిడెంట్ సరస్వతి, సురేష్. భాస్కర్, కృష్ణ ,శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

జి.రవి కిషోర్ ( బ్యూరో చీఫ్ )