ఇచ్చాపురం భూ సమస్యలపై రైతులతో భేటీ

ఇచ్చాపురం భూ సమస్యలపై రైతులతో భేటీ
 ఆనందపురం:జనసేవ న్యూస్ 
మండలంలోని ఇచ్చాపురం గ్రామంలో నెలకొనివున్న భూ సమస్యలపై స్థానిక తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్ అక్కడ గల రైతులతో శనివారం భేటీ అయ్యారు. 
జిరాయితీ భూములు పొందిన రైతులకు సాగు చేయడం తప్పా ఇప్పటి వరకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించలేదని వారు తహసిల్దార్ కు విన్నపం చేశారు. సమస్య స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి అవంతి శ్రీనివాసరావు దృష్టికి వెళ్ళడంతో తక్షణ పరిష్కారమార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. సాగులో ఉన్న 40మంది రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి త్వరగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని ఈ సమస్యను తమ సర్పంచ్ స్పందించి ముందుకు రావటం పై రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహంతి వెంకటలక్ష్మిశివాజీ, గ్రామ కార్యదర్శి జీవన లతా, వీఆర్వో పోలిపల్లి, సర్వేయర్ బంగారుదేవి , మహంతి శివాజీ తదితరులు పాల్గొన్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )