*అమృత్ పథకం పేరుతో విషం చిమ్ముతున్న పాలకులు*
*పట్టణ ప్రజలపై ముప్పేట దాడి*
*ఇంటి పన్ను పెంపు ,చెత్త పన్నుకు తోడు నీటి మీటర్ల బిగింపుకు రంగం సిద్ధం*
*విజయవాడలో నీటి మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన*
*ఈ ఆందోళనలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు,డి. కాశీనాథ్ తదితరులు*
బాబూరావు మాట్లాడుతూ...
📥 పట్టణ సంస్కరణల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటి లోని నీటి కుళాయికి నీటి మీటర్లు బిగించటం గర్హనీయం.
📥 24 గంటల నీటి సరఫరా సాకుతో నీటి మీటర్ల బిగింపుకు కుట్ర.
📥 నీటి మీటర్ల ద్వారా మంచి నీటితో వ్యాపారం ప్రారంభించిన పాలకులు.
📥 సంక్షేమం పేరు చెప్పి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న
ప్రభుత్వాలు.
📥 మున్సిపల్ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు తిరగక ముందే ఆస్తి విలువ ఆధారిత పన్ను ద్వారా
భారం మోపారు.
📥 చెత్త పన్ను పేరుతో ప్రజల నడ్డి విరిచారు.
📥ఇప్పుడు నీటి మీటర్ల పేరుతో మంచి నీటిని వ్యాపార సరుకుగా మార్చారు.
📥 భవిష్యత్తులో మరుగుదొడ్ల లెక్కించి డ్రైనేజీ పైన పన్నులు విధించడానికి రంగం సిద్ధం చేయడం సిగ్గుచేటు.
📥 కరోనా కష్టకాలంలో పేదలందరికీ నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని, బతకటానికి నెలకు కనీసం 7500 రూపాయలు నగదు ఇవ్వాలని, ప్రజలందరూ డిమాండ్ చేస్తుండగా పేదల ఆదుకొకుండా మంచినీళ్లు కూడా అందుబాటులో లేకుండా చేయటం దుర్మార్గం.
📥 కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం లో భాగంగా అందరికీ మంచి నీటిని అందిస్తామని చెప్పి నీటి మీటర్ల పేరుతో విషం చిమ్ముతున్నారు.
📥 కృష్ణా నది పక్కనే ఉన్నా, *మంచి నీరు పుష్కలంగా లభిస్తున్న విజయవాడ నగరంలో వేలాది కుటుంబాలకు నీటి మీటర్లు బిగించాలని నగరపాలక సంస్థ నిర్ణయించడం శోచనీయం.*
📥ఈ పథకానికి మున్సిపల్ మంత్రి బొత్స ప్రారంభించడం గర్హనీయం.
📥 మున్సిపాలిటీలను ప్రభుత్వాలు వ్యాపార సంస్థలుగా మార్చేస్తున్నాయి.
📥 గతంలో పాలకులు నీటి మీటర్లు ఏర్పాటు ప్రయత్నించగా విజయవాడ నగర ప్రజలు ఐక్య పోరాటాలతో తిప్పికొట్టారు.
📥 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీటి మీటర్లు వ్యతిరేకించిన వైసిపి, నేడు కేంద్రం ఆదేశాలకు లొంగి నీటిమీటర్లు ఏర్పాటు చేయడం ప్రజలను మోసగించడమే.
📥విజయవాడలో ప్రారంభించిన ఈ నీటి మీటర్ల పథకం భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం విస్తరిస్తుంది.
📥 విజయవాడ నగరంలో నీటి మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు అందరినీ కలుపుకొని ఉద్యమిస్తాం, ప్రతిఘటిస్తాం.
📥 భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం.
📥నేడు విజయవాడ కృష్ణ లంక లోని రాణి గారి తోటలో సిపిఎం విజయవాడ తూర్పు సిటీ కమిటీ ఆధ్వర్యంలో నీటి మీటర్లకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది.
📥 కార్యకర్తలు ప్లే కార్డులు ప్రదర్శించి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నీటి ఛార్జీల పేరుతో ప్రజలకు ఉరి వేస్తున్నారంటు వినూత్న నిరసన తెలిపారు.
📥 ఈ ఆందోళనలో బాబూరావుతో పాటు సిపిఎం నేతలు డి కాశీనాథ్, బి.నాగేశ్వరరావు, హరి నారాయణ, చిన్నారావు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.