ఘోర రోడ్డు ప్రమాదం...అక్క చెల్లెల్లు మృతి

*ఘోర రోడ్డు ప్రమాదం...అక్క చెల్లెల్లు మృతి* : 

 *నక్కపల్లి* : నక్కపల్లి మండలం ఉద్దండపురం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకతల్లి కడుపున పుట్టి నూరేళ్లుపాటు ఒకరికి ఒకరు సరదాగా గడుపదాము అనుకున్న ఆ అక్క చెల్లెళ్లను రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఒకేసారి కబళించిది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వీళ్ళని మృత్యువు కూడా వేరుచేయ లేకపోయింది. 

ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం పై ఎస్ఐ డి. వెంకన్న అందించిన వివరాలు ఇలా ఉన్నాయి, నక్కపల్లి మండలం శెట్టిబలిజ కాలనీకి చెందిన కె. పైడియ్య, మంగమ్మ లకు పావని (24), దుర్గ కామేశ్వరి (21) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీళ్లు ఇరువురు దివ్యదర్శనం కోసం స్కూటీ మీద నక్కపల్లి నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద గల తలుపులమ్మ తల్లి లోవకు వెళ్లారు. దర్శనం ముగించుకొని తిరిగి వస్తుండగా ఉద్దండపురం వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్క చెల్లెల్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు అని ఎస్ఐ వెంకన్న తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఢీకొట్టిన వాహనం సంఘటన స్థలం నుంచి వెళ్ళిపోయిందని, కుటుంబ సభ్యులఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పరారైన వాహనం కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న చెప్పారు.

Reporter
Suresh